A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల సంఘానికి విజయసాయి ఫిర్యాదు
Share |
June 17 2019, 3:14 pm

ఎపిలో డిజిపిని, ఇంటెలిజెన్స్ డిజిపి లను మార్చాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ సునీల్ అరోరాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికలలో అక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు.పోలీసు అదికారుల ప్రమోషన్ లలో అవకతవకలు జరిగాయన కూడా ఆయన పిర్యాదు చేశారు. చ‌ట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీలుగా నాన్‌ క్యాడ‌ర్ ఆఫీసర్‌లను నియ‌మించార‌ని పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డ‌బ్బును ఓటర్లకు పంచేందుకు వీలుగా త‌గిన బందోబ‌స్తును ఏర్పాటు చేసి త‌ర‌లిస్తున్నార‌ని ఆరోపించారు. శ్రీకాకుళంలో నారాయ‌ణ కాలేజీ నుంచి కారులో డ‌బ్బు త‌ర‌లిస్తుండ‌గా ఎమ్మార్వో ప‌ట్టుకున్నార‌ని, తీరా ఎన్నిక‌ల సామాగ్రి ఉంద‌ని అధికారులు బుకాయించార‌ని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో పోలీసులు అనుస‌రిస్తోన్న విధానాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామనివిజయసాయిరెడ్డి తెలిపారు.వైఎస్సార్‌సీపీ నేత‌లు ఫోన్ల‌ను అక్రమంగా టాపింగ్ చేస్తున్నార‌ని, దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అప్పగించామ‌ని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యానుతో పోలి ఉందని, ఆ గుర్తును మార్చాల‌ని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

tags : vijayasai,

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info