A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ మద్దతును పరోక్షంగా కోరారా
Share |
October 22 2019, 1:50 am

తన గురించి మాట్లాడే అర్హత జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శల నేపద్యంలో పవన్ పై విమర్శలు చేస్తూనే ఒక సూచన చేశారు.నేరుగా ఆ మాట చెప్పకపోయినా, పరోక్షంగా తనకు మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు ప్రసంగం వార్తను చూస్తే ఆ భావన కలుగుతుంది.తనకు,జగన్ కు సమదూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ అనడంపై ఆయన స్పందించారు.పవన్ కళ్యాణ్ ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలని, రాష్ట్రం పక్షాన ఉంటారా?లేక అవినీతి పరుల పక్షాన ఉంటారా అని ఆయన అన్నారు.తనకు, జగన్ కు సమాన దూరం అని పవన్ అనడం ఏమిటని, జగన్ తో తనకు పోలిక పెడతారా అని ఆయన అన్నారు. తనకు అనుభవం ఉంది గనకే రాష్ట్ర ప్రజలకు నీతిమంతమైన పాలన అందించానన్నారు.

tags : chandrababu, pawan kalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info