A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై పవన్ కళ్యాణ్ అరుపులు
Share |
October 22 2019, 3:00 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై జనసేన అదినేత పవన్ కళ్యాణ్్ విమర్శలు కురిపించారు. కెసిఆర్ కు ఆంద్రాలో ఏమి పని అని ఆయన అన్నారు.భీమవరం లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో ఆంధ్రా వాళ్ల రాజకీయాలు అవసరం లేనప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఎందుకు అని ఆయన అన్నారు. గ్రంధి శ్రీనివాస్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబ్యర్ది అని కాకుండా,టిఆర్ఎస్ అభ్యర్ది అని చెప్పండని పవన్ కళ్యాణ్ అన్నారు.తనకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని ఆయనఅన్నారు. కెసిఆర్ అంటే తనకు గౌరవం ఉంది కాని భయం లేదని ఆయన అన్నారు.గతంలో జగన్ పై టిఆర్ఎస్ వారు రాళ్లు వేశారని ,ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరే పవన్ కళ్యాణ్ కూడా కెసిఆర్ పై విమర్శలు చేసినట్లు గా ఉంది.తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఒకటిరెండుసార్లు కెసిఆర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అరుపులు అరిచారు.

tags : pawankalyan, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info