A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
Share |
June 20 2019, 8:54 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ,టిఆర్ఎస్ తో కలిసి పోటీచేయడానికి విశ్వయత్నం చేసి విఫలం అయిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కెసిఆర్ ను ఆంద్ర ద్వేషి అని అంటున్నారు. ఆంద్రులను కెసిఆర్ తిట్టారని చెబుతున్నారు.రాష్ట్ర విభజనకు కెసిఆర్ కారకుడని టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కెసిఆర్ పార్టీ పెట్టడానికిగాని, రాస్ట్ర విభజన సాదించడానికి గాని ..అన్నిటికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూల కారణం అంటే ఆశ్చర్యం కాదు.1983 నుంచి కెసిఆర్ తెలుగుదేశంలో ఉన్న మాట నిజం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన మామ ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి రాగలిగారు. ఆ తర్వాత ఆ పార్టీని, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కోగలిగారు.ఆ తరుణంలో చంద్రబాబు మద్దతుదారులలో కెసిఆర్ కూడా ఉండేవారు.చంద్రబాబు మంత్రివర్గంలో మొదటిసారి కెసిఆర్ కు పదవి రాలేదు.దాంతో సిద్దిపేట నుంచి వచ్చిన ఆయన మద్దతుదారులు రాజ్ భవన్ వద్ద ఆందోళన కూడా చేశారు.తదుపరి విస్తరణలో కెసిఆర్ కు అవకాశం ఇచ్చారు. 1999 లో టిడిపి,బిజెపి కూటమి కలిసి పోటీచేయగా, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కెసిఆర్ కు మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు దానికి కారణం ఏమిటంటే సిబిఐ డైరెక్టర్ గా పనిచేసి రిటైరైన విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వడం .విజయరామారావు ఖైరతాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు.తెలంగాణ నుంచి ఈయనకు, ఎపి నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న కోటగిరి విద్యాధరరావుకు మంత్రి పదవులు లభించాయి. వెలమ సామాజికవర్గం నుంచి ఇద్దరికి మించి ఇవ్వలేమని చంద్రబాబు అబిప్రాయపడ్డారు.అంతేకాక కెసిఆర్ పై ఆయనకు కొంత నెగిటివ్ అబిప్రాయం ఉండేది.దానితో కెసిఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.అదే సమయంలో కొందరు తెలంగాణ వాదులతో ఆయన స్నేహ సంబందాలు ఏర్పడ్డాయి. దానిపై చర్చోపచర్చలు జరిపేవారు.అయితే కెసిఆర్ కు ఉన్న శక్తి సామర్ద్యాలు కొంతవరకు తెలుసు కనుక చంద్రబాబు ఆయనకు ఉప సభాపతి పదవి ఇచ్చి సర్దిచెప్పాలని ప్రయత్నించారు. ఆ పదవిని తీసుకున్న కెసిఆర్ అక్కడ తెలంగాణ వాదాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నదానిపై దృష్టి పెట్టి పనిచేయడానికి ఒక ఆపీస్ దొరికినట్లు అయింది.ఆ తరుణంలో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచారు.దానిపై ఉమ్మడి ఎపిలో పెద్ద ఆందోళనలు జరిగాయ.కాంగ్రెస్,వామపక్షాలు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి పోలీసు కాల్పులు జరిగి నలుగురు కార్యకర్తలు మరణించారు.అదే సమయంలో కెసిఆర్ విద్యుత్ చార్జీలు పెంపును నిరసిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు.అయినా చంద్రబాబు దానిని సీరియస్ గా తీసుకోలేదు.తదుపరి వాతావరణాన్ని అంచనా వేసుకున్న కెసిఆర్ తన ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఆయన సిద్దిపేట ఉప ఎన్నికలో పోటీచేస్తే ఆయనను ఓడించడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు.కాని సిద్దిపేట ప్రజలు కెసిఆర్ కు పట్టం కట్టారు.అలా ఒక్కడిగా ప్రయాణం ఆరంభించిన కెసిఆర్ మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలలో కొంత ప్రబావం చూపారు.నిజామాబాద్ లో గెలవగలిగారు.కరీంనగర్ లో సత్తా చాటారు.దాంతో కాంగ్రెస్ పార్టీ అదిష్టానం కెసిఆర్ లోని శక్తిని గుర్తించింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, వెంకటస్వామి వంటివారు టిఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా కోరేవారు. అప్పట్లో సిఎల్పి నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి అది అంత ఇష్టం కాకపోయినా అంగీకరించక తప్పలేదు.2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర హామీని ఇచ్చింది.దాంతో రెండు పార్టీలు కలిసి పోటీచేసి అదికారంలోకి వచ్చాయి.ఆ సమయంలో టిడిపి సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండేది. పార్టీ ఓటమి తర్వాత జరిగిన మహానాడులో కూడా సమైక్య రాష్ట్రమే తమ విధానం అని చంద్రబాబు స్పష్టం చేశారు.కాని వైఎస్ రాజశేఖరరెడ్డి రోజురోజుకు బలపడుతున్నారన్న భావనతో చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారు.తన పార్టీలో ఒక కమిటీ అంటూ వేసి అబిప్రాయ సేకరణ తంతు నడిపి తెలంగాణకు అనుకూలం అని ప్రకటించారు.నిజానికి ఆంద్ర,రాయలసీమ టిడిపి మెజార్టీ నేతలు దానిని వ్యతిరేకించినా, వాళ్ల నోళ్లు మూయించి మరీ చంద్రబాబు తెలంగాణ అనుకూల తీర్మానం చేసి ఏకంగా ప్రణబ్ కమిటీకి పంపించారు.దీనికి ప్రాతిపదిక ఏమిటంటే టిఆర్ఎస్ తో కాంగ్రెస్ కు పొత్తు చెడింది.టిఆర్ఎస్ మంత్రులు బయటకు వచ్చేశారు. దాంతో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అదికారంలోకి రావాలని ఆశించిన చంద్రబాబుకు కెసిఆర్ స్పష్టమైన షరతు పెట్టారు. తెలంగాణ అనుకూల తీర్మానం చేస్తేనే అది సాద్యమని స్పష్టం చేశారు.ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు మెడలు వంచి మరీ తనకు కావల్సిన తీర్మానాన్ని కెసిఆర్ సాదించుకున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ అదిష్టానం కూడా వైఎస్ తో తెలంగాణ అనుకూల తీర్మానం చేయించింది. వైఎస్ అందుకు సుముఖం కాకపోయినా, ఆ ప్రకటన చదివి,అందులో పలు షరతులుపెట్టారు. భాగస్వాములందరితో చర్చించాకే నిర్ణయం చేయాలని కోరేవారు. తదుపరి వైఎస్ ఎలాంటి పొత్తులు లేకుండా కాంగ్రెస్ ను ఎన్నికలలో గెలిపించారు.టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నందున టిడిపి కొంతమేర లాభపడింది.తెలంగాణలో గణనీయంగా సీట్లు పొందింది.టిఆర్ఎస్ బాగా నష్టపోయింది.ఆ తర్వాత అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో మళ్లీ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆయన కుమారుడు జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని 145 మంది ఎమ్మెల్యేలు కోరినా కాంగ్రెస్ అదిష్టానం పట్టించుకోలేదు.ఆ తర్వాత జగన్ ప్యాక్టర్ ను కంట్రోల్ చేయడానికి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందని అంటారు.ఆ సమయంలో చంద్రబాబు, చిరంజీవి తమ అబిప్రాయాలు మార్చుకుని సమైక్య వాదనకు అనుకూలంగా మాట్లాడారు. చిరంజీవి పెయిర్ గా తన అబిప్రాయం మార్చుకుంటే,చంద్రబాబు మాత్రం యదావిదిగా అర్దరాత్రి రాష్ట్రాన్ని విడగొడతారా అంటూ కాంగ్రెస్ ను విమర్శించేవారు. కాంగ్రెస్ లో కూడా రాజీనామాల పర్వం సాగడంతో కేంద్రం ఆ ప్రక్రియను నిలిపివేసింది.తదుపరి నాలుగేళ్ల పాటు తెలంగాణ ఉద్యమం పార్టీలకు అతీతంగా సాగే పరిస్తితి ఏర్పడింది.రోశయ్య టైమ్ లో తెలంగాణ తీర్మానం రావడం, ఆగిపోవడం జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు.ఆ క్రమంలో తెలంగాణలో ఇబ్బంది రాకుండా ఉండడానికి తాను తెలంగాణ ఇవ్వడానికి వ్యతిరేకం కాదని ప్రచారం ఆరంభించారు.అంతేకాక కేంద్రానికి మళ్లీ తెలంగాణ విభజన లేఖ ఇవ్వవద్దని కొందరు ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబుకు కిరణ్ కుమార్ రెడ్డి కబురు చేశారు.అయినా చంద్రబాబు వినలేదు.ఆయన మరోసారి తెలంగాణ అనుకూల లేఖ ఇచ్చేశారు.అప్పుడు ఎవరైనా అడిగితే ఎలాగూ విభజన జరగదు కదా..లేఖ ఇస్తే ఏమి అవుతుందని వారికి చెప్పి పంపేవారు.కాని కేంద్రం చంద్రబాబు లేఖ ఆధారంగా ముందుకు వెళ్లింది. కాంగ్రెస్,బిజెపి ఎటూ విభజనకు అనుకూలమే.టిడిపి కూడా కలవడంతో కేంద్రానికి ఇబ్బంది లేకుండా పోయింది.ఈ మద్యకాలంలో జగన్ ఆద్వర్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఏర్పడింది. ఆర్టికిల్ 3 ప్రకారం ఏ నిర్ణయం అయినా కేంద్రం చేయాలన్న స్టాండ్ మొదట తీసుకున్నా,ఆ తర్వాత విభజనకు వ్యతిరేకంగా జగన్ లేఖ పంపించారు.ఇలా ఎన్నో మలుపులు తిరిగి ఉమ్మడి ఎపి విభజన వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న పలు యూటర్న్ లు, రాజకీయం కోసమే తెలంగాణ అనుకూల లేఖ ఇవ్వడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై విభజనకు వ్యతిరేకంగా నిప్పులు కురిపించడం, సోనియాగాందీ రాష్ట్రాన్ని విడదీసి ఆంద్రుల పొట్టకొట్టిందని ఆరోపించడం వంటివి ఎన్నో చేశారు.స్థూలం చూస్తే కెసిఆర్ ను చంద్రబాబు అవమానించడం తో ఆయన పార్టీ వీడారు. ఆ తర్వాత తిరిగి కెసిఆర్ తో కలవడానికి ఆయన అడిగినట్లు తెలంగాణ లేఖ ఇచ్చారు. తదుపరి తెలంగాణలో పాదయాత్ర సాగడానికి వీలుగా మరోసారి విభజన లేఖ ఇచ్చారు.అలా రాజకీయ వ్యూహాలతో చంద్రబాబు రాజకీయాలు చేశారే తప్ప నిజంగా ఎపి ప్రయోజనాలు ఆశించి చేశారా?లేక ఒకే అబిప్రాయంతో ఉన్నారా?అంటే అలా లేరనే చెప్పక తప్పదు.అందువల్ల ఆంద్ర ప్రజలకు నష్టం చేసింది కెసిఆర్ అవుతారా? చంద్రబాబు అవుతారా అన్నది తేల్చుకోవలసింది ఆంద్ర ప్రజలే.

tags : chandrababu, kcr

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info