A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది నీచ మనస్తత్వం
Share |
April 20 2019, 1:42 am

వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో తాము బాధలో ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు వెటకారపు నవ్వులతో మాట్లాడారని,నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి ,వైసిపి నేత కె.పార్ధసారది విమర్శించారు. చంద్రబాబుది నీచ మనస్తత్వం అని ఆయన విమర్శించారు. మానవత్వం ఉన్న మనషులెవరు ఇలా ప్రవర్తించరని వ్యాఖ్యానించారు. ఓటమి తప్పదనే భయంతో టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా ఇరికించాలనే ఆలోచన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వ ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ కోరాలని సవాలు విసిరారు.

tags : pardha saradhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info