A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
Share |
April 20 2019, 2:07 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ల ముందు ఓటమి కదలాడుతోందని,దాంతోనే ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రచార వ్యూహ కర్త ప్రశాంత కిషోర్ వ్యాఖ్యానించారు. తరచు చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలకు ఆయన తొలిసారి స్పందించారు.బీహారును కించపరిచే రీతిలో దుర్భాషలు ఆడడం కన్నా, ఎపి ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలన్నదానిపై పోకస్ చేసుకోండని కూడా ప్రశాంత కిషోర్ సలహా ఇచ్చారు.
ప్రశాంత కిశోర్ చేసిన ట్వీట్ లో ఈ విషయాలు ప్రస్తావించారు.


‘ ఓటమి తథ్యమని తేలడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది. చంద్రబాబునాయుడు ఉపయోగిస్తున్న భాష నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. సర్‌జీ బిహార్‌ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానిపై ఫోకస్‌ చేయాలి’ అని ప్రశాంత్‌ కిషోర్‌ సూచించారు. ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్‌ క్రిమినల్‌ రాజకీయాలు చేస్తున్నారని, బిహార్‌ బందీపోటు ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని చేసిన పిచ్చి విమర్శలకు ఆయన స్పందించారు.

tags : prasanta kishore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info