A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
Share |
June 20 2019, 8:58 pm

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ హక్కులపై టీడీపీ బేరసారాలు!?అంటూ తెలుగు గేట్ వేలో వాసిరెడ్డి శ్రీ్నివాస్ రాసిన ఈ కదనం ఆసక్తికరంగా ఉంది.


వివాదస్పద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా హక్కుల కోసం ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోందా?. అంటే ఔననే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే దీని వెనక బలమైన కారణాలే ఉన్నట్లు సమాచారం. తెరవెనక మంత్రాంగాల ద్వారా టీడీపీ అధిష్టానం ఈ సినిమాకు సంబధించిన అన్ని హక్కులను సుమారు 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయటానికి ‘బేరం’ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని కోసం పరిశ్రమలోని పెద్ద తలకాయలు రంగంలోకి దిగి ..టీడీపీకి అనుకూలంగా ఈ పని చేసేందుకు కృషి చేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం అన్నీ కలుపుకుని సుమారు 9 కోట్ల రూపాయల వరకూ అయ్యాయని…సినిమా బాగా ఆడినా మొత్తం 15 కోట్ల రూపాయలు వస్తేనే గ్రేట్ అని..అలాంటి సమయంలో ఏకంగా 25 కోట్లకు ఆఫర్ రావటంతో చిత్ర నిర్మాతలు కూడా ఈ ఆఫర్ వైపు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు. ఈ సినిమా సెన్సార్ కు సంబంధించి తొలుత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత సమాచార లోపం అంటూ వెనక్కి తగ్గి ప్రెస్ మీట్ ను కూడా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఈ పరిణామాలు వేగంగా సాగాయని చెబుతున్నారు. ఈ సినిమా విడుదల అయితే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసలు రంగు ప్రస్తుత తరానికి..ముఖ్యంగా యువతకు తెలుస్తుందనే భయంతో టీడీపీ ఉందని..అందుకే భారీ మొత్తం వెచ్చించి సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు కొనుగోలు చేసి సినిమాను భూస్థాపితం చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన ‘మహానాయకుడు’ సినిమాలో చంద్రబాబు హీరోయిజం చూపించాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి బాక్సాఫీస్ వద్ద ఇది బొక్క బోర్లాపడిన విషయం తెలిసిందే. ఎదురు డబ్బులు పెట్టి సినిమా నడిపించినా ఎవరూ కూడా ఆ సినిమా చూసే సాహసం చేయటానికి సిద్ధపడలేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా టీడీపీ చేతి చమురు వదుల్చుతోందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోగుట్టును విప్పే అవకాశం ఉంది. ఎన్టీఆర్ పై చంద్రబాబు ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నట్లు ఉన్నాడని ఓ నేత సరదాగా వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా విడుదల మార్చి 29న అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా మార్చి 22నే విడుదల కావాల్సి ఉంది. మరి కొత్త తేదీ అయిన మార్చి 29న అయినా విడుదల అవుతుందా?. లేక టీడీపీ బేరాలు ఫలిస్తాయా? వేచిచూడాల్సిందే.

tags : vasireddy, lakshmis ntr

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info