A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
Share |
April 20 2019, 1:43 am

ఆంద్రప్రదేశ్ లో 175 సీట్లకు గాను 116 సీట్లలో ధన ప్రభావం అత్యదికంగా ఉందని ఎన్నికల సంఘం గుర్తించింది. అలాగే దేశ వ్యాప్తంగా 110 లోక్ సభ నియోజకవర్గాలలో దనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని కూడా గమనించింది.‘అత్యంత ధన ప్రభావం’ ఎక్కువగా ఉన్న స్థానాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో తమిళనాడు, తెలంగాణలోని అన్ని లోక్‌ సభ నియోజకవర్గాలు, ఆంధ్ర ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, గుజరాత్‌లో సగం కంటే ఎక్కువ నియోజకవర్గాలున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. దేశ వ్యాప్తంగా 112 నియోజక వర్గాల్లో నగదు రూపంలో కాకుండా ఉచిత వస్తువులు, డ్రగ్స్‌, మద్యం, గృహోపకరణాలతో ఓటర్లను అభ్యర్థులు ప్రభావితం చేస్తున్నారని ఈసీ తెలిపింది.ఆంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 116 స్థానాల్లో, 16లోక్‌ సభస్థానాల్లో ధన ప్రభావం ఉంటోంది. బిహార్‌లో 21, గుజరాత్‌లోని 18లోక్ సభ స్థానాల్లో, కర్ణాటకలోని 12 లోక్‌సభస్థానాల్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటోంది.

tags : ap, survey

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info