A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ చెప్పిన సంచలన విషయాలు
Share |
November 30 2021, 7:57 am

తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ఆయన పలు సంచలన విషయాలు చెప్పారు. రాజకీయంగా ఇది అత్యంత నీచమైన చర్య ఈ హత్య అని ఆయన అన్నారు. ముప్పై ఏళ్లుగా రాజకీయంలో ఉన్న వ్యక్తిని ఆయన ఇంటిలోకి చొరబడి గొడ్డళ్లతో నరికి చంపడం దారుణం అని ఆయన అన్నారు ఆయన చరిత్ర చూస్తే ఎంతో సౌమ్యుడు అని అంతా చెప్పుకుంటారు.బాధ ఏమిటంటే దర్యాప్తు జరుగుతున్న తీరు.చనిపోతూ వివేకానందరెడ్డి ఒక లేఖ రాశారని పోలీసులు చూపుతున్నారని ఆయన అన్నారు. తల మీద ఐదుసార్లుగొడ్డలితో నరికారు. ఆ తర్వాత బాత్ రూమ్ లోకి వెళ్లి రక్తం పోయి మూర్చ తో మరణించారని పాబ్రికేట్ చేస్తున్నారు.ఒకరు కాదు.నలుగురు వ్యక్తులు చిన్నాన్నను ఎత్తుకు బాత్ రూమ్ కు ఎత్తుకు వెళ్లారు. అక్కడ కమ్ అవుట్ కు రక్తం పూశారు, తద్వారా ఆయన పడిపోయారని చూపించడానికి ప్రయత్నం చేశారన్నమాట.చిన్నాన్న అలాంటి పరిస్థితి లో ఉత్తరం రాస్తారా?హంతకుల సమక్షంలో లేఖ రాస్తారా?రాస్తుంటే హంతకులు చూస్తూ కూర్చుంటారా?ఒక డ్రైవర్ ను ఇరికించి కేసును పక్కదారి పెడుతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ తాత రాజారెడ్డి ని హత్య చేస్తే అప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు. తాతను చంపితే రాజశేఖరరెడ్డిని కట్టడి చేయవచ్చని భావించారు.ఆ తర్వాత తన తండ్రి హత్యకు గురయ్యారు.అప్పుడు విచారణ చేసింది ఇదే సిబిఐ లక్ష్మీనారాయణ.తదుపరి తనపై హత్యాయత్నం జరిగింది.తెలుగుదేశంతో సంబందం ఉన్న వ్యక్తి హత్యాయత్నం చేస్తే చంద్రబాబు ఎలా మాట్లాడారో చూశాం. ఇప్పుడు బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురి అయితే ఇప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి గా ఉన్నారు.అన్నిటిలో కుట్రకోణమే.ఎంత పెద్ద వాళ్లు దీనిలో ఉన్నా పట్టుకోవల్సిందే ,అయితే చంద్రబాబు హయాంలో న్యాయం జరగదని అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. తాను ఎస్పితో మాట్లాడుతుంటే పోలీస్ ఇంటిలజెన్స్ చీప్ ఎన్నో సార్లు ఎస్పికి పోన్ చేశారు?అంతా కుట్రగా జరుగుతోంది.నాకు దేవుడిపై నమ్మకం ఉంది.తప్పు చేసినవారికి మొట్టికాయలు వేస్తాడు..న్యాయం నిలబడుతుంది.అయితే ఈ ఘటన ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారు ఎవరూ ఆవేశాలకు గురి కావద్దని కోరుతున్నానని జగన్ అన్నారు.

tags : jagan, murder

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info