A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేకా మరణంలో కుట్ర కోణం
Share |
May 25 2019, 8:19 am

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణంపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. కడప మాజీ ఎమ్.పి వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ తమ పెదనాన మరణంపై అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.నిన్న అంతా ఆరోగ్యంగా ఉండి, మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారని ,మొదట ఆయన గుండెపోటుతో ,రక్తపు వాంతులతో మరణించారని అనుకున్నామని, కాని ఆ తర్వాత బౌతిక కాయంపై గాయాలు ఉండడం సందేహాలు వచ్చాయని ఆయన చెప్పారు.ఇది హత్య అన్న భావన ఏర్పడిందని, ఎవరో ఈ హత్యకుపాల్పడ్డారని,దీనిలో కుట్ర కోణం వెలికి తీయాలని పోలీసులను కోరుతున్నామని ఆయన అన్నారు .ఎవరు దీని వెనుక ఉన్నా కనుక్కోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.వివేకా పిఎ కృష్ణారెడ్డి కూడా దీనిపై పోలీసులకు పిర్యాదు చేశారు. తలపు తెరచి కుని ఉండడం ,గాయాలు ఉండడం తో ఇది సహజ మరణం కాదని పోలీసులకు పిర్యాదు చేశారు.ఎన్నికల సమయంలో డిస్టర్బ్ చేయడానికి ఇది జరిగిందా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేశారు.

tags : ys viveka,death, doubts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info