A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండు పార్టీలు ఒకే జెండా పెట్టుకున్నాయి..కొత్త చరిత్ర
Share |
May 22 2019, 4:41 am

కూటముల చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమేనని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజవాది పార్టీ, బహుజన్ సమాజ పార్టీ రెండు కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.ఆ రెండు పార్టీలు కలిపి ఎన్నికల కోసం కామన్ జెండాను రూపొందించుకోవడం విశేషంగా భావిస్తున్నారు. సమాజవాదిపార్టీ జెండా ఎర్ర రంగులో ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ గుర్తు నీలం రంగులో ఉంటుంది.ఇప్పుడు ఈ రెండురంగులు కలిపి ఒక జెండాగా తయారు చేశారట. ఒకే జెండాలో ఈ రెండు రంగులు ఉంటాయన్నమాట.అలాగే రెండుపార్టీల గుర్తులు కూడా ఈ జెండాపై ఉంటాయి. సమాజవాది గుర్తు సైకిల్ అయితే, బిఎస్పి గుర్తు ఏనుగు.అలాగే కటవుట్ లు కూడా అఖిలేష్, మాయావతిల బొమ్మలతో కలిసి తయారు చేస్తున్నారు.కాగా విడివిడిగా రెండు పార్టీల జెండాలుకొనడం కన్నా ఒకే జెండా చౌకగా ఉందని కార్యకర్తలు చెబుతున్నారు.ఈ కామన్ జెండాకు గిరాకి ఉండడంతో వ్యాపారులు కప్పులు,ఇతర వస్తువులపై వీరిద్దరి బొమ్మలు వేసి అమ్ముకుంటున్నారట.

tags : up, sp,bsp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info