A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్.కు నాకు ఉన్న తేడా -పవన్
Share |
May 25 2019, 8:20 am

ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని ,అందువల్లనే జనసేన సభకు ప్రజలు తరలివచ్చారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో ఎన్.టిఆర్ సంపూర్ణమైన వయసులో, మనమళ్లు పుట్టిన తర్వాత రాజకీయాలలో మార్పు కోసం వచ్చారని ఆయన అన్నారు.కాని తాను స్టార్ డమ్ ఉండగానే రాజకీయాలలోకి వచ్చానని ఆయనఅన్నారు.కొందరు నేతలు తమ భవిష్యత్తు కోసం యువతను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. యువతకు పాతిక ఏళ్ళ భవిష్యత్తు ఇవ్వాలని తాను పాతికేళ్ల కెరీర్ ను వదలుకుని వచ్చానని ఆయన అన్నారు.తనను నమ్మింది ఇప్పుడు ఉన్న అన్నదమ్ములు, ఆడపడచులు, ఒక రక్తం కాదు..ఒక కులం కాదు..మానవత్వం కలిపిందని ఆయన అన్నారు.వేల కోట్లు తమకు లేవని ఆయన అన్నారు.చంద్రబాబు ను అడిగి ఒక ఇన్ ప్రాజెక్టు సంపాదించుకోండి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు.నేను ఒప్పుకోలేదు.నాకు కావాలంటే ఒక అబిమాని అన్నం పెడతారు అని ఆయన అన్నారు.ఒంటరిగా వచ్చాం..ఒంటరిగా వెళతాం.తీసుకువెళ్లేది ఉండదు..ఇవ్వడానికే వచ్చా..తీసుకోవడానికి రాజకీయాలలోకి రాలేదు.అని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info