A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విప్రో అజిమ్ ప్రేమ్ జీ గ్రేట్
Share |
May 25 2019, 8:59 am

అమెరికాలో వేల కోట్లు విరాళాలుగా ఇస్తుంటారని వారెన్ బఫెట్,బిల్ గేట్స్ వంటి వారి పేర్లు వింటాం.మన భారతీయుడు అజిమ్ ప్రేమ్ జీ కూడా తన దానగుణాన్ని,ఔదర్యాన్ని చాటుకుని వారి సరసన చేరారు.సమాజం కోసం విప్రో సంస్థలోని తన వాటా ముప్పై నాలుగు శాతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్‌ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తన ప్రకటనలో తెలిపింది. దీంతో తన ఫౌండేషన్‌ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్‌ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. 2018 డిసెంబర్‌ నాటికి విప్రోలో ప్రమోటర్‌ హోల్డింగ్‌ 74.3 శాతంగా ఉంది.

tags : azim premji

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info