A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేల కొనుగోళ్లు నీచం
Share |
May 25 2019, 9:31 am

తెలంగాణ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టిఆర్ఎస్ లో చేరుతుండడంపై సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నీచ సంస్కృతి అని ఆయన అన్నారు.ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.రాజకీయ ఫిరాయింపులే పరిపాలనా? ప్రశ్నించే గొంతును నొక్కడమే రాజకీయమా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే అంత భయమా అని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులను గొప్పగా చెప్పుకోవడం సిగ్గులేనితనమని బట్టి పేర్కొన్నారు.‘‘దేశానికి దిశానిర్దేశం, ఆదర్శం అంటే ఇదేనా? టిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేనితనంతో పాలన సాగిస్తోంది. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్.. దాన్ని గొప్పగా చెప్పుకోవడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. అని ఆయన అన్నారు. పార్టీ వీడుతున్నవారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

tags : mallu, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info