A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ నోట చంద్రబాబు మాటలు
Share |
May 25 2019, 8:34 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అంతిమంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోకి వెళ్లినట్లు కనబడుతోంది.బిజెపి ఎపికి అన్యాయం చేసిందని ,దానితో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎందుకు అనుకూలంగా ఉంటున్నదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అనేక విషయాలలో హామీలు అమలు చేయలేదని ఆయన అన్నారు .చంద్రబాబు మీద కోపం ఉంటే ఉండవచ్చు.కాని బిజెపితో ఎలా కలుస్తారని ఆయన అన్నారు. అలాగే టిఆర్ఎస్ తో ఎలా జగన్ అవగాహన పెట్టుకున్నారని ఆయన అన్నారు. జగన్ కు చెబుతున్నా..ఆంద్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారితో ఎలా స్నేహం చేస్తారు అని ఆయన అన్నారు. తనకు కెసిఆర్ అంటే గౌరవం అని ఆయన అన్నారు. ఆవేదనగా ఉంది..బాదగా ఉంది అని ఆయన అన్నారు.అలాగే చంద్రబాబుకు తెలియచేస్తున్నాను. మొదటి రోజు నుంచి తనకు అండగా ఉంటే ప్రత్యేక హోదా తెచ్చేవారం.వారు మాట మార్చిన విధానం బాద కలిగించింది. ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.తాను ఒక మాట చెబితే వెనక్కి తిప్పను అని ఆయన అన్నారు. 2019 మార్పుకు చిహ్నమని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రబుత్వంలో అవినీతి గురించి కాని, వర్తమానంగా జరుగుతున్న అంశాలను కాని ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్్ ప్రసంగం చేయడం విశేషం.

tags : pawankalyan, chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info