A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి మరో ఎమ్మెల్యే గుడ్ బై
Share |
May 25 2019, 9:36 am

తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టిడిపిలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్గటారు.టిడిపిలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం. కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లు ఇచ్చిన మాట మీద నిలబడేవారని కూడా సుబ్బారావు అన్నారు.వారిద్దరి హాయాంలలోనే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ఆయన అన్నారు.ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కూడా టిడిపికి గుడ్ బై చెప్పిరు.

tags : ap, tdp, shock

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info