A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇకపై కుటుంబ జోక్యం ఉండదు-కోడెల
Share |
May 22 2019, 4:17 am

ఒకవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో టిడిపి అసమ్మతివర్గం నేతలు,కార్యకర్తలు ఏకంగా నిరసన ర్యాలీ చేస్తుండగా, మరో వైపు కోడెల తాను ఇరవైరెండో తేదీన సత్తెనపల్లి సీటు నుంచి నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు.అసమ్మతి నేతలు తమను కోడెల కుటుంబం వేదించిందని,కోడెల ఇక్కడ పోటీచేయడానికి వీలు లేదని, సత్తెనపల్లిలో కోడెల పోటీచేస్తే ఓడిపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తూ ర్యాలీ తీశారు. కాగా కోడెల మాట్లాడుతూ పార్టీలో చిన్ని,చిన్న అబిప్రాయబేధాలు ఉంటాయని,అందరిని కలుపుకుని పోతామని చెప్పారు.తనకుటుంబం జోక్యం లేకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా కోడెల హామీ ఇచ్చారు.ఈ నెల ఇరవైరెండున నామినేషన్ వేస్తున్నానని, అంతా సహకరించారని ఆయన అన్నారు.

tags : kodela, family

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info