A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హత్యలకు పర్మిషన్ స్తానంటున్న టిడిపి ఎమ్మెల్యే
Share |
May 25 2019, 8:40 am

ధర్మవరం శాసనసబ సభ్యుడు,టిడిపి నేత గోనుగుంట్ల సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దారుణఃగా ఉన్నాయి. తనను గెలిపించిన తర్వాత ఎవరినైనా హత్య చేసుకోవడానికి తన అనుచరులకు అవకాశం ఇస్తారట.దీనికి సంబందించిన ఆడియో వెలుగులోకి వచ్చింది.ఈ ఆడియోని టిడిపి అసమ్మతి నేతలే దీనిని బయటపెట్టారు.‘‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్లు అయినాక ఆర్నెల్లు సమయం మీకు ఇడిసిపెడతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్‌ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’’.. అని అన్నారు. ఇది ఒక ఎమ్మెల్యే చెప్పవలసిన మాటేనా?

tags : ap, mufcdfs, permissions

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info