A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి టిక్కెట్లు - బాలకృష్ణ ఎఫెక్ట్
Share |
May 25 2019, 8:19 am

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల గందరగోళంలోకి ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవేశించడంతో కొన్ని టిక్కెట్ల వ్యవహారం క్లిష్టంగా మారిందంటున్నారు. దీనిపై వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రి లోకేష్ ను మంగళగిరి కి ఎంపిక చేయడంలో కూడా కారణం ఉందని అంటున్నారు.తన చిన్నల్లుడు భరత్ కు విశాఖ లోక్ సభ టిక్కెట్, తన ముఖ్య అనుచరుడు కదిరి బాబూరావుకు కనిగిరి టిక్కెట్ ఇవ్వాలని బాలకృష్ణ పట్టుబట్టారట.దీనిపై బాలకృష్ణ అల్టిమేటమ్ ఇచ్చారట.దాంతో విశాఖ లోక్ సభ లేదా, రాజమండ్రి లోక్ సభ కు టిక్కెట్ ను బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు ఇవ్వాలని తలపెట్టారని కధనం. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళకు ఒకేచోట సీట్లు ఇవ్వడం బాగోదని భావించిన చంద్రబాబు ఈ మేరకు మార్పులు చేసినట్టు సమాచారం. భరత్ కోసమే లోకేశ్‌ను మంగళగిరి నియోజకవర్గానికి మార్చినట్టు తెలుస్తోంది. మొదట లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక, బాలకృష్ణ అల్టిమేటంతో కనిగిరి నుండి కదిరి బాబురావుకు మరోసారి సీటు కేటాయించినట్టు సమాచారం.

బాలకృష్ణ కోసమే మంత్రి శిద్ధా రాఘవరావు సీటుకు చంద్రబాబు ఎసరు పెట్టారు. అంతేకాకుండా కదిరి సీటు ఇస్తానని ఉగ్ర నరసింహరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ.. మారిన సమీకరణాలతో ఆయనను దర్శికి మార్చాలని నిర్ణయించారు.కాగా దర్శి టిక్కెట్ శిద్దా రాఘవరావు కుమారుడికి ఇవ్వాలని టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.శిద్దా రాఘవరావుకు ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు.

tags : balakrishna, tdp, tickets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info