A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు జగన్ పై విషం చిమ్మడంలో..
Share |
May 25 2019, 9:09 am

ఈనాడు దినపత్రిక నిజంగానే ముసుగు పూర్తిగా తీసేసి తెలుగుదేశంకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాయడం ఆరంభించినట్లు కనిపిస్తోంది.ఓటు కు నోటు కేసు తాజా పరిణామాల గురించి కాని, ఇరవైమూడు మంది వైసిపి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబందించి కాని పెద్దగా ప్రస్తావించని ఈనాడు జగన్ కు సంబందించి రెండేళ్ల క్రితం ఏదో జరిగిందంటూ తెలుగుదేశం చెప్పిందంటూ ఒక పెద్ద వార్తను ప్రచురిచింది. అదీ కూడా కరపత్రం మాదిరి దాదాపు ఒక పుల్ పేజీ కేటాయించి జగన్ పై విషం చిమ్మడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. ఒకవైపు సిబిఐ, ఈడి లు కక్షతో వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు చేసే వాదనకు మద్దతు ఇస్తారు. మరో వైపు అదే ఈడి ఏదో రాసిందని జగన్ కు వ్యతిరేకంగాను వార్తలు ఇస్తారు.ఈనాడు ఇలా దిగజారకుండా ఉంటే బాగుండేది.అందువల్లే చంద్రబాబు .ఈనాడు రామోజీరావు మరికొందరు కలిసి కుల రాజకీయం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయుడు తిలక్ వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పార్టీ ఓడిపోతోందన్న అనుమానం కలిగి ఈనాడు ఇలా అవుతోందా?

tags : eenadu, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info