A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కు కూడా అసమ్మతి సెగ
Share |
May 22 2019, 4:02 am

ఎపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు సొంత పార్టీలో అసమ్మతి కి ఎదురు అవడం ఆశ్చర్యంగానే ఉంది.సత్తెనపల్లి సీటును కోడెలకు ఇవ్వొద్దంటూ కొందరు అసమ్మతి వర్గం నేతలు ఆందోళనకు దిగారని వార్తలు వస్తున్నాయి.అసలే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తనను నరసరావుపేట లోక్ షభకు పోటీచేయాలని చెబుతుండడమే పెద్ద సమస్య అయితే,ఇప్పుడు సత్తెనపల్లిలో అసమ్మతి సెగ తగలడం ఇబ్బందిగా మారింది. కాగా మరో టిడిపి ఎమ్ఎల్యే ప్రభాకర చౌదరి కి టిక్కెట్ ఇవ్వరాదని,బలిజలకు సీటు ఇవ్వలని కోరుతూ కొందరు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు.ఒక కార్యకర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు.కాగా డోన్ సీటు తమకే ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భార్య ,మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ పట్టుబడుతున్నారట.దాంతో టిడిపి నేత కె.ఇ.ప్రతాప్ హుటాహుటీన చంద్రబాబును కలవడానికి వెళ్లారట.పోలవరం టిక్కెట్ విషయంలో కూడా రెండు వర్గాల మధ్య నిరసనలు జరుగుతున్నాయి.

tags : kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info