A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ మాజీ జెడికి టిక్కెట్ ఆఫర్-టిడిపి సెల్ప్ గోల్
Share |
March 26 2019, 3:54 pm

సీబీఐ మాజీ జెడీకి టికెట్ ఆఫర్..టీడీపీ సెల్ఫ్ గోల్ అంటూ వాసిరెడ్డి శ్రీ్నివాస్ తెలుగు గేట్ వే లో ఇచ్చిన కధనం ఇది.


‘ఓ వైపు అవినీతిపై పోరాటం చేస్తున్నామని చెబుతూ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీ నో చెప్పటం సరికాదు. ఇది ప్రజలకు మంచి సంకేతం పంపదు. అవినీతిని అంతమొందించేందుకు మరిన్ని పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి. కానీ సీబీఐపై ప్రవేశం నిషేధం సరికాదు.’ ఇదీ సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సర్కారు కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయంపై చేసిన వ్యాఖ్యలు. మరి అవినీతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చే టిక్కెట్ పై సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారా?. దీని ద్వారా ఆయన ప్రజలకు ఎలాంటి సంకేతం ఇవ్వదల్చుకున్నారు. సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారని…ఆయనకు భీమిలి సీటు ఇస్తున్నారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను లక్ష్మీనారాయణ ఇప్పటి వరకూ ఎక్కడా ఖండించలేదు కూడా.

ఓ వైపు అవినీతికి సంబంధించి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ అదే పార్టీలో సీబీఐ మాజీ జెడీ చేరితే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి. వైసీపీ ఎప్పటి నుంచో ఈ సీబీఐ మాజీ అధికారిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలతో కలసి జగన్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తోంది. దీనికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చేలా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే అది ఖచ్చితంగా రాజకీయంగా తమకు లాభం చేకూరుస్తుందని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సొంత పార్టీ పెడతానని..ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పిన లక్ష్మీనారాయణ సడన్ గా టీడీపీలో చేరితే అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందనే అనుమానాలు తటస్థుల్లో కూడా కలగటం ఖాయం. తాజా పరిణామాలు లక్ష్మీనారాయణ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఒకెత్తు అయితే…రాజకీయంగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అని చెబుతున్నారు.

tags : ap, cbi, x jd

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info