A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెఎ పాల్ వెనుక చంద్రబాబు -వాసిరెడ్డి స్టోరీ
Share |
March 26 2019, 3:25 pm

కె పాల్ వెనక చంద్రబాబు?! అంటూ వాసిరెడ్డి శ్రీ్నివాస్ రాసిన కదనం ఇది. తెలుగుగేట్ వేలో ఈ కదనాన్ని ఇచ్చారు.

కె ఎ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ వెనక తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారా?. అసలు పాల్ కు…చంద్రబాబుకు సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు సంగతి. కె ఎ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం హెలికాఫ్టర్ గుర్తు కేటాయించింది. వైసీపీకి చెందిన ఫ్యాన్..హెలికాఫ్టర్ ఫ్యాన్ ఓకేలా ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కారు..ట్రక్కు గుర్తు సామీప్యతల కారణంగా టీఆర్ఎస్ పలు చోట్ల సీట్లు, చాలా చోట్ల ఓట్లు నష్టపోయింది. అదే పరిస్థితి ఎదురుకాకుండా వైసీపీ ఫిర్యాదు అయితే చేసింది. వైసీపీ ఫిర్యాదుపై స్పందిస్తే కె ఎ పాల్ స్పందించాలి. నా గుర్తుపై మీకేమి అభ్యంతరం అని వైసీపీని ప్రశ్నించాలి. కానీ అసలు అధ్యక్షుడు పాల్ కంటే ముందు టీడీపీ అధినతే చంద్రబాబు వైసీపీ ఫిర్యాదుపై స్పందించటంతో కె ఏ పాల్ వెనక చంద్రబాబు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం నాడు పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ‘హెలికాప్టర్’ గుర్తు చూసి కూడా జగన్ కు భయం.

‘హెలికాప్టర్’ పై ఫ్యాన్ ఉందంటూ ఈసికి ఫిర్యాదు’ చేశారంటూ వ్యాఖ్యానించారు బాబు. పాల్ కు లేని టెన్షన్ చంద్రబాబుకు ఎందుకు? అంటే ఈసీ స్పందించి ఈ గుర్తు మారిస్తే వైసీపీకి మేలు జరుగుతుందనే భయం చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనపడుతోంది. అంతే కాదు..పాల్ కు ఏపీలో ఓట్లు పడితే అవి ఎక్కువగా క్రిష్టియన్ ఓట్లే అని ఓ అంచనా ఉంది. ఏపీలో క్రిష్టియన్లు ప్రస్తుతం మెజారిటీ వైసీపీ పక్కనే ఉన్నారు. పాల్ ను రంగంలోకి దింపి కొన్ని ఓట్లను అయినా చీల్చి జగన్ ను దెబ్బతీయాలనే ప్లాన్ తో పాల్ కు ‘ఫండింగ్’ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా పాల్ పార్టీ గుర్తుపై వైసీపీ ఫిర్యాదు చేస్తే ఆయన కంటే ముందు చంద్రబాబు స్పందించటంతోనే అసలు రంగు బయటపడలేదా?.

tags : vasireddy srinivas

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info