A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిలోకి ఏలూరు మేయర్
Share |
May 25 2019, 9:10 am

ఏలూరు తెలుగుదేశం పార్టీ కి చెందిన మేయర్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేయడం విశేషం. ఆమె తన భర్త ఎస్స్ ఎమ్.ఆర్.పెదబాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. టీడీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. ఆళ్లనానిని ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తామని భరోసానిచ్చారు. అధినేత ఆదేశిస్తే మేయర్‌ పదవికి రాజీనామా చేస్తానని నూర్జహాన్‌ స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఏలూరు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చామని వారు తెలిపారు.

tags : ysr congress, eluru mayor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info