A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీనారాయణ నీతి ప్రవచనాలు ఏమయ్యాయి
Share |
May 25 2019, 9:11 am

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంతకాలం చెప్పిన నీతి ప్రవచనాలు ఏమయ్యాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి,మాజీ ఎమ్.పి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. నీతి కబుర్లు చెబుతూ, సొంత పార్టీ పెడతానని ప్రచారం చేసిన లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లో నీతిని కనిపెట్టారా అని ఆయన అడిగారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కోట్లు కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు ఆయనకు నీతిమంతుడిగా కనిపిస్తున్నారా అని ఆయన అన్నారు .చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్ల తర్వాత జగన్ పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లారని ఆయన అన్నారు.పిరాయింపులపై చర్యలు తీసుకోకుండా ఇంతకాలం టిడిపిని కాపాడిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇప్పుడు తన సీటు గురించే ఏడుస్తున్నారని ఆయన అన్నారు.పొద్దుగూకులు జగన్ గురించి తప్ప చంద్రబాబు వేరేసంగతి మాట్లాడకుండా ఏడుస్తున్నారని ఆయన అన్నారు.ఇక ఎల్లో మీడియా గురించి చెప్పడం అనవసరమని ఆయన అన్నారు.

tags : c.ramachandrayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info