A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి గంటా అలిగారా
Share |
May 22 2019, 4:02 am

ఎపి మంత్రి గంటా శ్రీ్నివాసరావు అలకబూరని వార్తలు వస్తున్నాయి.ఆయనను విశాఖపట్నం లేదా అనకాపల్లి లోక్ సభ స్థానాలలో ఏదో ఒకదాని నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా చెబుతుండడంతో ఆయన సుముఖత చూపడం లేదని చెబుతున్నారు.అయినా చంద్రబాబు తన వైఖరికే కట్టుబడి ఉండడంతో ఆయన గత రాత్రి నుంచి ఎవరికి అందుబాటులోకి రావడం లేదని వార్తలు సూచిస్తున్నాయి.భీమిలి నుంచి లోకేష్ తో పోటీచేయించాలని చంద్రబాబు మొదట కోరుకున్నారు ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేయాలని అనుకుంటున్నారు.ఈలోగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను భీమిలి టిక్కెట్ కు తెరపైకి తెచ్చారు. ఈ నేపధ్యంలో గంటా అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. అధిష్టానం బుజ్జగింపుల పర్వానికి దూరంగా ఉండాలనే నేపథ్యంలో గంటా నిన్నటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. నిన్న సాయంత్రం అమరావతికి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్‌ వెళ్లినట్టుగా సమాచారం. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్లు కదనం.

tags : ganta, dissatis faction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info