A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఏ సీటు ఇచ్చినా ఒకే
Share |
May 25 2019, 9:15 am

తన భర్త తోట నరసింహం ఆరోగ్యం బాగో లేక ఆస్పత్రిలో చేరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, ఇతర టిడిపి నేతలు కాని పలకరించలేదని తోట వాణి అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలు కోసం రాజకీయాల కోసం కొనసాగుతున్నామని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరగానే జగన్ ఒక మాట అన్నారని, నరసింహం ఆరోగ్యం తమది బాద్యత అని అన్నారని,అది తమకు ఎంతో భరోసా ఇచ్చిందని ఆయనఅన్నారు.ఇక్కడ కు వచ్చాక,తాము ఎంతో సరైన నిర్ణయం తీసుకున్నామని అనిపిస్తోందని ఆయన అన్నారు.తమ పరిస్తితిని దృష్టిని ఉంచుకుని జగన్ ఏదో ఒక నియోజకవర్గం ఇవ్వవచ్చని భావిస్తున్నామని అన్నారు. పెద్దాపురం నుంచి పోటీచేస్తారా అని అడగ్గా అది పార్టీ నాయకత్వం చెప్పాలని ఆయన అన్నారు. జగన్ ఏమి చేసినా దానికి సమ్మతమేనని ఆయన అన్నారు.

tags : tota vani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info