A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కనీస గౌరవం ఇవ్వలేదు-తోట
Share |
May 25 2019, 8:23 am

లోక్ సభ లో తెలుగుదేశం పక్ష నేత తోట నరసింహం వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన తన సతీమణి వాణి తో కలిసి రాగా జగన్ వారికి స్వాగతం చెప్పి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.తాను కాకినాడ లోక్ సభ సభ్యుడిగా, లోక్ సభలో ఆ పార్టీ నేతగా పనిచేశానని ఆయన చెప్పారు. టిడిపి తన విషయంలో ఘోరమైన అన్యాయం చేసిందని ఆయన అన్నారు. ప్రజల కోసం పనిచేసే తనను టిడిపి నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో తాను కాంగ్రెస్ పక్షాన సభ్యుడిగా ఉన్నానని, ఆ తర్వాత మరోసారి ఎన్నికై మంత్రిగా కూడా చేశానని ఆయనఅన్నారు.కాంగ్రస్ వల్లే రాష్ట్రం ముక్కలైందని ఆయన అన్నారు. తాను చంద్రబాబును కలిసి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరితే కనీసం పట్టించుకోలేదని ఆయన చెప్పారు.తాను కొంత అనారోగ్యంగా ఉన్నానని,అయినా టిడిపి తరపున లోక్ సభలో పోరాటం చేశానని ఆయన అన్నారు.గతంలో మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు అనారోగ్యానికి గురైతే, వైఎస్ ఆయనను తొలగించకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని ,అది వైఎస్ గొప్పదనమని తోట అన్నారు.కాని చంద్రబాబు తమకు గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు.జగన్ మంచి నాయకత్వంలో పనిచేయడానికి సిద్దమవుతున్నామని ఆయన అన్నారు.జగన్ కాబోయే ముఖ్యమంత్రి అని తాను చెబుతున్నానని అన్నారు.

tags : tota, narasimham

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info