A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పర్చూరు సిటింగ్ ఎమ్మెల్యేని పెండింగ్ పెట్టారు
Share |
March 19 2019, 1:10 pm

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నుంచి పోటీచేసేవారిలో పెద్దగా మార్పు చేయడం లేదు.ఇద్దరు మంత్రులు, ఉప సబాపతికి మళ్లీ టిక్కెట్లు కేటాయించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష చేసి టిక్కెట్లను ఖరారు చేస్తున్నారు.కాగా ప్రకాశం జిల్లాలో సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న పర్చూరు ను పెండింగులో పెట్టడం విశేషం. అక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ పోటీచేసే అవకాశం ఉండడంతో అభ్యర్ధిపై తుది నిర్ణయం తీసుకోలేదని బావిస్తున్నారు.ఎంపికైన కొన్ని పేర్లు.
మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), కొల్లు రవీంద్ర (బందరు), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), తంగిరాల సౌమ్య (నందిగామ). బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్‌), గద్దె రామ్మోహన్‌రావు (విజయవాడ తూర్పు), వల్లభనేని వంశీ (గన్నవరం), బోడె ప్రసాద్‌ (పెనమలూరు), డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ (అవనిగడ్డ) ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన బదులు ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌ పోటీ చేయనున్నారు.

కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నలుగురు అభ్యర్థులు.. పి.రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు), సతీశ్‌రెడ్డి (పులివెందుల), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), పుత్తా నరసింహారెడ్డి (కమలాపురం) ఖరారయ్యారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో చెంగల్రాయుడు (రాజంపేట), నరసింహ ప్రసాద్‌ (రైల్వేకోడూరు), రమేశ్‌కుమార్‌రెడ్డి (రాయచోటి), నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (పీలేరు), అనీషారెడ్డి (పుంగనూరు)లకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేఈ శ్యాంబాబు (పత్తికొండ), కేఈ ప్రతాప్‌ (డోన్‌), బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), తిక్కారెడ్డి (మంత్రాలయం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం), బీసీ జనార్దనరెడ్డి (బనగానపల్లె)లకు అసెంబ్లీ అభ్యర్థులు ఖరారయ్యాయి.
వేమూరు సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ల పోటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

tags : parchuru, ticket

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info