A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వాలి
Share |
May 24 2019, 4:31 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన ప్రజలకు మేలు చేసి చూపుతారని కడప మాజీ ఎమ్.పి వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం అందిస్తామని , రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి, వేయించి గెలిపించాలన్నారు. సబ్‌ప్లాన్‌కు జగన్‌ చట్టబద్ధత కల్పిస్తారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుబడిన కులాలకు 50 శాతం పదవులు వస్తాయని అవినాష్‌రెడ్డి తెలిపారు. బీసీల్లోని 139 కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లికి ఏటా రూ.15వేలు తల్లి ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. సంచార జాతులకు ఉచితంగా ఇళ్లు, ఉపాధి, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తామన్నారు. అలాగే ప్రతి నిరుపేద, నిరుద్యోగికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇళ్లులేని వారికి ఇల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక్కసారి వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే.. ప్రతి ఒక్కరి గుండెలో ఆయన చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన అందిస్తారని అవినాష్‌రెడ్డి ప్రజలకు వివరించారు.

tags : avinashreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info