A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంతకీ లోక్ సత్తా పోటీచేస్తున్నట్లేనా
Share |
May 25 2019, 4:48 pm

ప్రాంతీయ పార్టీల తోడ్పాడు లేకుండా ఏ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజల మానిపెస్టోను ఆయన విడుదల చేశారు.పదవుల కోసం తమ పార్టీ పోటీ చేయదని ఆయన వ్యాక్యానించారు.
ఓటేస్తేనే ప్రజాస్వామ్యం కాదని, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందితేనే అది ప్రజాస్వామ్యం అవుతుందని జేపీ అన్నారు. దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చాలా అంశాల్లో పొరపాట్లు చేసి ఉండొచ్చు.. గానీ విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టి వ్యవస్థను బాగు చేస్తోందని కితాబిచ్చారు. ఏపీలోనూ ఉచిత వైద్యం అందించొచ్చని చెప్పారు. ఎన్నికల కోసం పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడమేంటని జేపీ ప్రశ్నించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధిపై ఖర్చు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలు రాగానే తాయిలాలు ప్రకటిస్తున్నారని, వీటికి లోక్‌సత్తా విరుద్ధమని ఆయన చెప్పారు.ఇంతకీ ఎన్నికలలో పోటీచేస్తున్నారా?లేదా?

tags : jp,contest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info