A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో దళితులను తిడితే అరెస్టు చేయరు కాని..
Share |
May 25 2019, 4:39 pm

ఎపిలో దళితులను దూషించినవారి జోలికి వెళ్లరన్నమాట. అలా దూషించడం ఏమిటని,సంబందిత వీడియో చూసి ఇతరులకు పంపితే అరెస్టు చేస్తారన్నమాట.ప్రబుత్వం , పోలీసులు అలా ఉన్నారన్న అబిప్రాయం ఏర్పడుతుంది. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితరలను బండబూతులు తిడితే ఆయనను టచ్ చేయడానికి కూడా సాహసం చేయని పోలీసులు మంచి దైర్యంగా అప్పుడే పెళ్లి చేసుకున్న యువకుడిని రాత్రి వేళ అని కూడా చూడకుండా హడావుడిగా అరెస్టు చేశారు. దీనిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో ఏలూరులో ఉద్రిక్తత ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (టీడీపీ) ప్రసంగ వీడియోలను షేర్‌ చేసిన వారిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చింతమనేని మాట్లాడిన వీడియోను మరొకరికి పంపించాడంటూ కామిరెడ్డి వెంకట నరసింహారావు(నానీ) అనే యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నానీకి శుక్రవారం రాత్రి పెళ్లి జరగ్గా, శనివారం మధ్యాహ్నం తన స్వగ్రామం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్‌ జరిగింది. రిసెప్షన్‌ ముగిసి అత్తగారింటికి వెళ్లిన నానీని పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్‌ ఒత్తిడి మేరకే నానీ అరెస్టు చేసినట్లు సమాచారం. చింతమనేని శనివారం ఉదయం ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారితో గంటసేపు సమాలోచనలు జరిపిన తర్వాత ఈ అరెస్టు జరగడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఆ వీడియోను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేశారు. అయితే, పోలీసులు మాత్రం రిమాండ్‌ రిపోర్టులో ఎక్కడా మార్ఫింగ్‌ అన్న పదాన్ని వాడలేదు. ఆ వీడియోనువెబ్‌లో పోస్టు చేసిన కత్తుల రవికుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వీడియోను కత్తుల రవికి పంపించాడంటూ శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి నానీని ఈ కేసులో ఎ–2గా చేర్చారు.

tags : ap, chintamaneni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info