A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
Share |
May 25 2019, 9:10 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రముఖ నటుడు నాగార్జున తమ పార్టీ అదినేత జగన్ ను కలిస్తే నేర చరిత్ర అని అంటారా అని చంద్రబాబుపై ఆమె ఫైర్ అయ్యారు. పిల్లను ఇచ్చిన మామ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుపై పదిహేడు కేసులు ఉన్నాయని,వాటిలో స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆమె అన్నారు. తన వియ్యంకుడు బాలకృష్ణ ఇంటిలోనే తుపాకి కాల్పులు జరిపారన్న సంగతి చంద్రబాబు మర్చిపోయారా? స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంటిలో నే బాంబులు పేలాయి. చింతమనేని ప్రభాకర్ రౌడీయిజంపై ఎన్ని కేసులు ఉన్నాయో అందరికి తెలుసు. మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులపైఉన్న లైంగిక వేదింపుల కేసుల మాటేమిటి?ఇన్ని కేసులు ఉన్న చంద్రబాబు,ఆయన సహచరులు నోటికి వచ్చినట్లు మాట్లాడతారని అన్నారు. తమ అదినేత జగన్ పై కాంగ్రెస్,టిడిపిలు కలిసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఆయన దైర్యంగా ఎదుర్కుంటున్నారని ఆమె అన్నారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info