A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
Share |
May 25 2019, 9:16 am

తెలుగుదేశం పార్టీ అదికారం కోల్పోవడమే కాకుండ, పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ,తెలుగుదేశం పార్టీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతోందని సర్వేలు అన్నీ చెబుతున్నాయని అన్నారు. అందువల్లే ఆ పార్టీ ఎమ్.పిలే చీకొట్టి పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు నాయుడే వద్దని చెప్పారని, ఇప్పుడు మళ్లీ కొత్త అంకానికి తెరలేపి,బిజెపిపై దుష్ప్రచారం చేశారని జివిఎల్ తెలిపారు. మర వైపు బిజెపి మళ్లీ కేంద్రంలో అదికారంలోకి రాబోతోందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవినీతి పాలనను, చంద్రబాబు తరచు మాట మార్చుతున్న విషయాలను ప్రజలు గమనించి విసిగిపోయారని ఆయన అన్నారు.

tags : gvl, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info