A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
Share |
May 25 2019, 9:27 am

భవిష్యత్తులో పలువురు కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే.. గంటా శ్రీనివాసరావు తమను టీడీపీలోకి తీసుకెళ్లారని అన్నారు. వైఎస్‌ జగన్‌కు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని తెలిపారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చెప్పినా.. ప్రజల కోసమే పోరాటానికి చేశారని అవంతి శ్రీనివాస్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గెలిపించిన నాయకుల భూములను కబ్జా చేసే వ్యక్తిత్వం గంటా శ్రీనివాసరావుదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో భీమిలి సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన గంటా ... ఆ తర్వాత ఆయనే అక్కడ నుంచి పోటీ చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లపై అధికార టీడీపీ ఐదేళ్లలో 50సార్లు మాట మార్చిందని అవంతి శ్రీనివాస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరికి మంత్రి గంటా శ్రీనివాసరావు కారణమని ఆరోపించారు. డబ్బులకు ఓట్లు వేసే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.

tags : avanti, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info