A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ విమర్శలు మరీ చీప్ గా ఉంటున్నాయి
Share |
May 25 2019, 4:19 pm

మంత్రి లోకేష్ వ్యాఖ్యలు హుందాగా ఉన్నట్లు కనిపించవు. ప్రతిపక్ష నేతను 420 అని అనడం ద్వారా పెద్ద విమర్శ చేశానని ఆయన ఫీల్ అవుతున్నట్లుగా ఉంది. తండ్రి బాటలోనే లోకేష్ కూడా పిచ్చి విమర్శలు చేస్తున్నట్లుగా ఉంది. టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ ఎపిలో చంద్రబాబు ఓటమి తప్పదని వ్యాఖ్యానించడంపై లోకేష్ స్పందించడం తప్పు కాదు. కాని ఆయన స్పందనలో నిస్పృహ కనిపిస్తుంది. పెడరల్ ప్రంట్ అంటూ 420 జగన్ తో కెసిఆర్ కలిశారని అనుచిత వ్యాఖ్య చేస్తున్నారు. ఓటు కు నోటు కేసులో తన తండ్రి పట్టుబడి విజయవాడ పారిపోయారని ఇతర పక్షాలు విమర్శిస్తుంటాయి. దానిని ఏమంటారో లోకేష్ తెలుసుకోవాలి.నాలుగున్నరేళ్లు మోడీతో అంటకాగి, అంత గొప్ప ప్రదాని ప్రపంచలోనే లేడని చెప్పిన చంద్రబాబు,లోకేష్ లు ఇప్పుడు ఇతర నేతలను మోడీతో లింక్ పెట్టి మాట్లాడడానికి నానా పాట్లు పడుతున్నారు. ‘‘దిల్లీ మోదీ, తెలంగాణ మోదీ కేసీఆర్‌, ఏపీ మోదీ జగన్‌కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ.. చివరకు 420 జగన్‌తో జతకట్టి తెలంగాణకే పరిమితం అయ్యారు. టిడిపి ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్‌కు భంగపాటు తప్పదు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక.. ముగ్గురు నాయకులు ఒక్కటై కుట్రలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఎపి ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.టిడిపి ఓడిపోతే ఎపికి ఏమీ కాదు..ఎందుకంటే ఈ ప్రపంచం ఏ ఒక్కరికోసమో ఆగదు కదా!ఏది ఏమైనా యువకుడైన లోకేష్ మంచి బాష ,పదాలు నేర్చుకుంటే ఆయనకే మంచిది కదా!

tags : lokesh, ktr,kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info