A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీని ఎందుకు కౌగిలించుకున్నానంటే..రాహుల్
Share |
May 25 2019, 4:19 pm

ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ ఇప్పటికీ పార్లమెంటులో ప్రధాని మోడీని కౌగిలించుకున్న విషయంపై వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది.ద్వేషానికి ప్రేమే సమాధానం అని అందుకే అలా చేసినట్లు ఆయన చెప్పారు.విద్యార్దులతో ముఖాముఖీ సందర్భంగా వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెప్పారు. ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఇలాంటి వాటి వల్ల తాను ఇద్దరు కుటుంబసభ్యులను పోగొట్టుకున్నానని ఆయన అన్నారు. పార్లమెంటులో ప్రధాని మోదీని నేను కౌగిలించుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతారని తనకు తెలుసునని ఆయన అన్నారు. అసలేం జరుగుతుందో ప్రదానికి అర్థం అయి ఉండదు. ఆయన జీవితంలో ప్రేమ లేదని తనకు అనిపించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల ప్రేమ వ్యక్త పరచాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

tags : rahul, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info