A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
Share |
May 25 2019, 8:19 am

తమ పార్టీ అదినేత జగన్ తన కుమార్తె ను చూడడానికి లండన్ వెళితే దానిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి దిగజారి మాట్లాడడం దారుణంగా ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. చంద్రబాబు లక్ష్యం వైఎస్‌ కుటుంబమేనని, ప్రతి రాజకీయ నాయకుడికీ కుటుంబ వ్యవహారాలుంటాయని.. కానీ చంద్రబాబుకు మాత్రం కుటుంబం విలువలు తెలియవన్నారు. తాను సీఎంననే విషయాన్ని మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితులకు వ్యతిరేకంగా చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యల నుంచి దారి మళ్లించేందుకు హవాలా డబ్బు.. అంటూ చర్చలు పెట్టించారని, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుకూల చానల్స్‌లో చర్చలు పెట్టించి తనకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారన్నారు. విదేశాల్లో తన డబ్బు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్‌ ప్రకటించారని, చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ సవాల్‌ చేశారని, దాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారని నిలదీశారు.

tags : gadikota, chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info