A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
Share |
May 25 2019, 9:09 am

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చింతమనేని ప్రభాకర్‌ అనే పిచ్చికుక్కను విప్‌గా పెట్టుకున్నారని వైఎస్సార్‌ సీపీ అదికార ప్రతినిది టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యాలు చేసిన చింతమనేని నాలుక చీరేస్తాం అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వ్యాఖ్యలపై మాలలు, మాదిగలు అందరూ ఆలోచించాలని సూచించారు.చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తున్నారని, దళిత సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. పధకం ప్రకారం జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితులని అవమానించారని ఆయన అన్నారు.

tags : sudhakar babu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info