A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు స్మార్ట్ పోన్ ల తో రాజకీయం
Share |
May 25 2019, 8:20 am

తినడానికి తిండి లేకున్నా.. వాడుకోవడానికి స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తున్నారని ,ఎన్నికల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరుగురి సభ్యులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని, కానీ వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేరన్నారు. అందరూ అగ్రకులస్తులేనని తెలిపారు. కర్నూల్‌లో కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబును అర్థరాత్రి కలవడం.. అదేంటయ్యా అంటే భోజనానికి అని బుకాయిస్తూ, ప్రాజెక్టుల కోసమని చెబుతారని, కానీ కోట్ల అడిగిని ప్రాజెక్టులు.. రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటని అందరికి తెలుసన్నారు. జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని, సీట్ల సర్దుబాటును త్వరలోనే తేలుస్తామని ఆయన చెప్పారు.

tags : ramakrishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info