A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అది కల్తీ కూటమి
Share |
May 25 2019, 8:23 am

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఆరువందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, నాలుగున్నరేళ్లు గడిచినా వాటిని అమలుచేయలేదని అన్నారు. . కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని అన్నారు. కూటమి పేరుతో చంద్రబాబు దేశమంతా తిరుగుతూ ప్రజాధన్నాన్ని దుర్వినియోగం చేస్తూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాజకీయ ఎజెండా తప్ప అభివృద్ధి, విజన్‌ లేని రాజకీయ నాయకుడు చంద్రబాబని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ఏపీతో పాటు తెలంగాణ కూడా నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

tags : gvl, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info