A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గర్జనతో టిడిపి నేతలు వణుకుతున్నారు
Share |
May 25 2019, 8:27 am

బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సభకు జనం రాలేదని, అట్టర్‌ ఫ్లాఫ్‌ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అలా అంటే జనాలు నవ్వుతారని అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌కు మద్దతుగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని, 2019లో జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.జగన్‌ సీఎం అయితేనే టీడీపీ హయాంలో దగాపడ్డ బీసీ సోదరులంతా లాభపడుతారన్నారు. గత 40 ఏళ్లుగా టీడీపీ.. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదన్నారు. వారి జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని మండిపడ్డారు.

tags : anil, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info