A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి మీడియా,ఎపి ప్రబుత్వం హడావుడి చూడండి
Share |
May 25 2019, 8:51 am

ఎపిలో తలుగుదేశం కు మద్దతు ఇచ్చే మీడియా, ప్రభుత్వం కలిసి ఎంత డ్రామా నడుపుతున్నాయో చూడండి.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన వస్తుందని తెలిసి ,కోడ్ అమలులోకి వస్తే రైతులకు ప్రకటించిన అన్నదాత సుఖీబవ పదకం కింద డబ్బులు ఇవ్వడం కష్టమని బావించిన టిడిపి ప్రబుత్వం హడావుడిగా రైతుల ఖాతాలలో వెయ్యి రూపాయలు వేస్తున్నట్లు ప్రకటించింది. కోడ్ విషయం చెప్పకుండా టిడిపి మీడియా అదేదో రైతుల కోసం అన్నట్లు కలరింగ్ ఇస్తూ రెండు రోజులుగా ఎంత డ్రామా నడిపిందో గమనించండి. ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..రైతులకు వెయ్యి రూపాయలు వెంటనే..రైతులకు పండగే అంటూ శీర్షికలు పెట్టి ప్రచారం చేశాయి. ఆ తర్వాత డబ్బు విడుదల అయింది.. అంటూ మళ్లీ ఈరోజు కూడా బానర్ కదనాలు ఇచ్చారు. ముందుగా రెండువేల ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు వెయ్యి రూపాయలు వేసింది చెప్పకుండా ఇలాంటి ప్రచారాలకు మీడియా దిగడంలో ఆంతర్యం అర్దం చేసుకోవచ్చు. సోమవారం రైతులకు రూ.258.50కోట్లు జమ చేయగా.. మంగళవారం రూ.231 కోట్లు బదిలీ చేయనున్నారు. వివరాలు అన్ని ఉన్నవారికి ముందుగా వేస్తున్నారట. ఓట్ల కొనుగోలుకు జనం డబ్బునే వాడడం అంటే ఇదే కదా!

tags : farmers, funds

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info