A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి దారిలోకి శివసేన వచ్చింది
Share |
May 25 2019, 8:22 am

ఎన్.డి.ఎ లో ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న శివసేన ఎట్టకేలకు బిజెపితో సంధి చేసుకుంది. ఇంతకాలం తరచు బిజెపిపై విమర్శలు కురిపిస్తూ చికాకు పెట్టింది. కాని తాజా పరిణామాలలో శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్‌షా చేపట్టిన మంత్రాంగం ఫలించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

tags : sivasena, bjp, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info