A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిలోకి టిడిపి ఎమ్.పి రవీంద్రబాబు వచ్చేశారు
Share |
March 26 2019, 4:01 pm

అమలాపురం టిడిపి ఎమ్.పి పి.రవీంద్ర బాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అదినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను జగన్ ఆహ్వానించారు. తాను పుట్టింటికి వచ్చినట్లు గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో వందల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు ఓటు కు నోటు కేసుతో విజయవాడకు చంద్రబాబు వెళ్లిపోయారని ,ఈ విషయాలపై తాము కూడా మాట్లాడుకునేవారమని ఆయన అన్నారు.గతంలో ప్రత్యేక హోదా వద్దని తమను అందరిని చంద్రబాబు మోసం చేశారని, ఎపి పరిస్థితిని ఆర్దికంగా దిగజార్జారని ఆయన ఆరోపించారు. ప్యాకేజీ రాలేదు..ప్రత్యేక హోదా రాలేదు..మరి ఏమి సాధించిందేమిటని ఆయన అన్నారు.బిజెపితో నాలుగున్నరేళ్లు సంసారం చేసిన చంద్రబాబు ఆ పార్టీని తిడుతున్నారని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా కోసం అందరం రాజీనామా చేద్దామని జగన్ అన్నారని,కాని అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని రవీంద్ర బాబు అన్నారు. అప్పట్లో వైసిపి ఎమ్.పిలను ఎద్దేవ చేశారని, తమతో దర్నాలు చేయించారని అన్నారు. నవనిర్మాణ దీక్సలని బిజెపి ఒడిలో కూర్చున్నామని, దర్మపోరాట దీక్షలని కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నామని, ఇదంతా తమకు చాలా ఇబ్బందిగా మారిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి సరిపడ వ్యక్తి కాదన,ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదని అర్దం అయిందని రవీంద్రబాబు అన్నారు.ఈయన ఉన్నంతకాలం పెట్టుబడులు రావని అర్దం అయిందని అన్నారు. ఒకే సామాజికవర్గానికి చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగపడుతోందని రవీంద్ర బాబు ఆరోపించారు.

tags : ravindrababu, ycp,

Latest News
*కడపలో జనం లేని బాబు,అబ్దుల్లా సభ
*లోకేష్ నామినేషన్ నోటరీపై అభ్యంతరం
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన మోహన్ బాబు
*దుర్మార్గపు రాజకీయం చేయాలంటే...
*నన్ను ఓడించడానికి కుట్ర- పవన్ కళ్యాణ్
*హైదరాబాద్ రెండో రాజదాని అంటున్న రేవంత్
*పవన్ పాకిస్తాన్ వ్యాఖ్యల పరిశీలన
*హరీష్ రావు ఇక స్టార్ ప్రచార కర్తే
*సోనియమ్మకు ఆ రహస్యాలు చెప్పలేదు
*పవన్ కళ్యాణ్ తెలిసి,తెలియక-చంద్రబాబు
*చంద్రబాబుకు మళ్లీ రక్తం ఉడుకుతోందట
*కేసీఆర్‌ ఎలా ప్రధాని అవుతారు: డీకే అరుణ
*వైసిపి అభ్యర్దిపై ఇప్పుడు చార్జీషీట్ వేశారంటే..
*తాడిపత్రిలో రౌడీ రాజ్యం
*ప్రత్యేక ప్యాకేజీ -చంద్రబాబు లేఖ చూపిన బిజెపి
*వైసిపలోకి మాజీ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే
*బిజెపిలోకి టిఆర్ఎస్ ఎమ్.పి
*నవరత్నాలు లేవు..చంద్రబాబు గాలి హామీలు లేవు
*టిడిపిని వదలి జనసేన టిక్కెట్ తీసుకున్నారు
*దగ్గుబాటికి కూడా ప్రజాశాంతి అభ్యర్ది పోటు
*90 మంది పోటీదారులు దాటితే బాలెట్ పత్రమే
*టిడిపికి దూరం ఎందుకయ్యానంటే..పవన్
*ఇక ఎన్నికలలో పోటీచేయనన్న నేత
*చంద్రబాబు చేసిన కులపిచ్చి వ్యాఖ్య మంచిదేనా
*మెదక్ లో హరీష్ రావు ప్రచారం
*కెసిఆర్ ఎమ్.పిగా పోటీచేయడం లేదే
*జెసి సోదరుల ఏకఛత్రాధిపత్ం ఇక చెల్లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info