A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామ్ గోపాల్ వర్మ పోలింగ్ పెట్టారు
Share |
May 25 2019, 8:25 am

ప్రముఖ నటుడు బాలకృస్ణకు మళ్లీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోటు మొదలైంది. పంటికింద రాయిలా మారిన వర్మ ఈసారి బాలకృష్ణ తాజా సినిమా మహానాయకుడుకు, తను తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.కు మద్య పోలింగ్ పెట్టారు.ఎన్టి.ఆర్ పై బాలకృస్ణ తీసిన కదానాయకుడు సినిమా హిట్ కాకపోవడం, వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా ట్రైలర్ హిట్ అవడం, మరో వైపు బాలకృష్ణ తీస్తున్న ఎన్.టి.ఆర్.బయోపిక్ రెండో భాగం మహా నాయకుడు సినిమా విడుదల అవుతున్న నేపద్యంలో వర్మ ఈ పోలింగ్ పెట్టారు.
తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏదంటూ వర్మ ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించారు.దీనికి నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్‌కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్‌ రిజల్ట్‌ను పోస్ట్‌ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్‌ అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.
41,734 votes • Final results
995 people are talking about this
ఇక ఇప్పటికే వచ్చిన కథా నాయకుడు రిలీజ్ తర్వాత... అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

tags : ramgopal varma, polling

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info