A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రం
Share |
April 25 2019, 1:19 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యంగ్యస్త్రాలు విసరడం కొనసాగించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కూడా తమ పార్టీయే కారణమని సీఎం చంద్రబాబు చెబుతాడని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబ్తుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబే ప్యాకేజీ ముద్దు అన్నాడని, ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని హోదా కావాలంటున్నాడని మండిపడ్డారు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటేనన్నారు.
చంద్రబాబుకు కెసీఆర్ అన్నా మోదీ అన్నా వణుకని, తనలాగా ఇతరులకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడని తెలిపారు. జర ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ! అంటూ అని ఎద్దేవ చేశారు.

tags : vijayasai, babu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info