A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజకీయ కోణంలో మీడియా సంస్థలు-వెంకయ్య
Share |
August 21 2019, 6:06 am

దేశంలో మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాక్యానించారు. బెంగుళూరులో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో మీడియా కొన్ని కథనాలు, వార్తల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చెప్పారు. వాణిజ్య, రాజకీయ కోణంలోనే కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని మీడియా సంస్థలు సంచలనాలకు వేదిక కావాలనే కుతూహలం ప్రదర్శిస్తున్నాయన్నారు. పాత్రికేయ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేసేందుకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, జీవితంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్య ఉపయోగపడాలని, అంతేగాని ఉద్యోగం కోసమే చదువు అనడం సరైన విధానం కాదని వెంకయ్య నాయుడు అన్నారు.

tags : venkayya, media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info