A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కమ్యూనిస్టులు టిడిపికి రహస్య మిత్రులు
Share |
August 21 2019, 6:16 am

ఎపిలో కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పార్టీకి రహస్య మిత్రులని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కమ్యూనిస్టు లు దుష్ప్రచారంలో టీడీపీకి తోడయ్యారని.. వారు ఆవిర్భావం నుంచి చైనా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంటారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టులు కరుమరుగైనా వారికి కనువిప్పు కలగడం లేదన్నారు. కాగా, వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి బీజేపీ గౌరవిస్తే దానిని చంద్రబాబు వక్రీకరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నేత సత్యప్రకాశ్‌ ఇదే సభలో పేర్కొన్నారు.

tags : veeraju, tdp, communists

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info