A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యాత్ర సినిమా తిలకించిన వైఎస్ విజయమ్మ
Share |
April 25 2019, 1:49 am

తన భర్త,దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తీసిన యాత్ర సినిమాను ఆయన సతీమణి విజయమ్మ తిలకించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యాత్ర సినిమాను చాలా బాగా తీశారని చెప్పారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్‌ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్‌ కట్టుబడేవారని ఆమె వ్యాఖ్యానించారు.

tags : vijayamma,yatra

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info